GRAMA/WARD SACHIVALAYAM RESULTS-2019 - సచివాలయ ఉద్యోగాల మెరిట్‌ జాబితా వెల్లడి, ఈ సర్టిఫికేట్లు తీసుకెళ్లాలి

RESULTS-2019 - సచివాలయ ఉద్యోగాల మెరిట్‌ జాబితా వెల్లడి.


ఈ సర్టిఫికేట్లు తీసుకెళ్లాలి.. 

✦ అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రం తీసుకెళ్లాలి. 

✦ గెజిటెట్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు జతల సర్టిఫికేట్లు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు వెంటతీసుకెళ్లాలి. 

✦ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు తప్పనిసరి. 

✦ పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి సర్టిఫికేట్ లేదా అధికారుల నుంచి తీసుకున్న పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఉండాలి. 

✦ విద్యార్హతకు సంబంధించిన అన్ని ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు తీసుకెళ్లాలి. 

✦ 4 నుంచి 10వ తరగతి దాకా విద్యాభ్యాసానికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు. 

✦ పాఠశాలలో, కళాశాలలో చదవకుండా.. నేరుగా డిగ్రీ చదివినవారు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి. 

✦ ఏపీ పునర్విభజన కారణంగా 02.06.2014 - 01.06.2019 మధ్యకాలంలో తెలంగాణ నుంచి ఏపీకి వలసవచ్చిన అభ్యర్థులు స్థానికత కోసం సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. 

✦ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం. 

✦ బీసీ అభ్యర్థులు తాజాగా తహసీల్దార్‌ జారీ చేసిన నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌. 

✦ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తూ వెయిటేజీ పొందిన అభ్యర్థులు తమ ప్రధానాధికారి నుంచి ఇన్‌ సర్వీసు సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 

✦ అభ్యర్థులు తమపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిర్ణీత ఫార్మాట్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

✦ ప్రత్యేక పాఠశాలల్లో చదివిన అంధులు, వినికిడి లోపాలు ఉన్న అభ్యర్థులు తల్లిదండ్రుల రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

✦ ఇక దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, స్పోర్ట్స్, NCC విభాగాలకు చెందిన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లను తీసుకెళ్లాలి. 



know your Hallticket details 
Know Your OTPR details
Candidate Reports
Click Now

User Manual PDF
Download Now
Tags: మెరిట్‌ జాబితా, వార్డు సచివాలయాల్లో, సచివాలయ ఉద్యోగాల, WARD, ఏపీలో గ్రామ, Apply Online, Andhra Pradesh, సర్టిఫికేట్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం  

Post a Comment

0 Comments