APGS Recruitment Result 2019 సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులను భర్తీ చేయనున్నారు.

APGS Recruitment Result 2019 | గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులను భర్తీ చేయనున్నారు.


ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్షల ఫలితాలు గురువారం (సెప్టెంబరు 19) విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబరు 1 నుంచి 8 వరకు నిర్వహించిన 14 పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 19.50 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష పూర్తయిన పదిరోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం విశేషం. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఫలితాల వెల్లడి కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అధికారులు ఫలితాలు విడుదల చేసినప్పటికీ.. సర్వర్ మొరాయించడంతో అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోలేకపోతున్నారు. 

మొత్తం 1.98 లక్షల మంది అర్హత..గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు మొత్తం 19,50,630 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వీరిలో 1,98,164 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. వీరిలో పురుషులు-1,31,327 మంది; స్త్రీలు-66,835 మంది ఉన్నారు. మొత్తం 10.15 % ఉత్తీర్ణత నమోదైంది.


పోస్టులుహాజరైన అభ్యర్థులుఅర్హత సాధించినవారు
కేటగిరీ-111,63,92287,280
కేటగిరీ-2 గ్రూప్-ఎ1,16,18821,149
కేటగిరీ-2 గ్రూప్-బి1,20,74023,308
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్22,6226,239
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్10,7862,622
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్12,1181,605
పంచాయతీ కార్యదర్శి (డిజిటల్ అసిస్టెంట్)2,72,0883,623
వార్డు శానిటేషన్-ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ52,3341,474
వార్డు ప్లానింగ్-రెగ్యులేషన్ సెక్రటరీ12,6432,096
ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్5,6082,163
ANM/ వార్డు హెల్త్ సెక్రటరీ65,777 30,499
వార్డు ఎడ్యుకేషన్-డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ60,98511,276
వార్డు వెల్ఫేర్-డెవలప్‌మెంట్ సెక్రటరీ30,7354,188
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్4,036642
మొత్తం19,50,5821,98,164

విభాగాలవారీగా అర్హత వివరాలను పరిశీలిస్తే..
కేటగిరీఅర్హత సాధించిన అభ్యర్థులు
ఓపెన్ కేటగిరీ24,583
బీసీ1,00,494
ఎస్సీ63,629
ఎస్టీ9,458
మొత్తం1,98,164
అర్హత మార్కులు ఇలా... 
కేటగిరీఅర్హత మార్కులు
ఓపెన్ కేటగిరీ40%
బీసీ35%
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు30%

పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు..
కేటగిరీమార్కులు
ఓపెన్ కేటగిరీ122.5
బీసీ122.5
ఎస్సీ114
ఎస్టీ108

అక్టోబరు 2న రాష్ట్రవ్యాప్తంగా 788 గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలో ప్రారంభంకానున్న మొత్తం 788 సచివాలయాల్లో.. మండలానికి ఒకటి చొప్పున 678 పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఒక్కో వార్డు చొప్పున 110 సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి. 

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,26,728 ఉద్యోగాలకు గానూ 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలను సెప్టెంబరు చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల స్వీకరణకు 1902 కాల్‌సెంటర్‌ నెంబరును ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులకు ఏమైనా ఫిర్యాదులుంటే నేరుగా ఈ నెంబరుకు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. 

పరీక్షలు సాగాయిలా.. 
* సెప్టెంబరు 1న కేటగిరీ-1, కేటగిరీ-3 (డిజిటల్ అసిస్టెంట్) పరీక్షలు నిర్వహించారు. 
* సెప్టెంబరు 3న వీఆర్వో, సర్వేఅసిస్టెంట్; ఏఎన్‌ఎం/వార్డు హెల్త్ సెక్రటరీ పరీక్షలు నిర్వహించారు. 
* సెప్టెంబరు 4న విలేజ్ అగ్రికల్చర్ సెక్రటరీ, విలేజ్ హార్టికల్చర్ సెక్రటరీ పరీక్షలు నిర్వహించారు. 
* సెప్టెంబరు 6న విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఏనిమల్ హస్బెండరీ పరీక్షలు నిర్వహించారు. 
* సెప్టెంబరు 7న కేటగిరీ 2(ఎ) ఇంజినీరింగ్ అసిస్టెంట్/వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, కేటగిరీ-3 విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించారు. 
* సెప్టెంబరు 8న కేటగిరీ 3 వార్డు ప్లానింగ్-రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్-డెవలప్‌మెంట్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్-డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్-ఎన్విరాన్‌మెంట్ సెక్రటీ పరీక్షలు నిర్వహించారు. 

స్టైఫండ్ రూ.15 వేలు...గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 2న విధుల్లో చేరతారు. నియామకాలు పొందినవారికి రూ.15 వేల స్టైఫండ్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత శాశ్వత పేస్కేలు వర్తింపజేస్తారు. వీరికి రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ అమల్లో ఉంటుంది. వీరికి డీడీఓగా పంచాయతీ సెక్రటరీ వ్యవహరించనున్నారు. పంచాయతీ సెక్రటరీలకే గ్రామ వాలంటీర్లకు వేతనాలు చెల్లించే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది. 
http://results.gramasachivalayam.ap.gov.in/apVswsResult20193647125896.apgs
Andhra pradesh grama ward sachivalayam recruitment 2019 Dashboard

Tags: APGS, Recruitment, Result 2019, ఏపీలో గ్రామ, APGS Recruitment Result 2019, సచివాలయ పరీక్షల ఫలితాలు|గ్రామ సచివాలయ పరీక్షల ఫలితాలు, Grama Sachivalayam Result, Grama Sachivalayam Exam Results, AP Grama Sachivalayam Results 2019, Andhra Pradesh Grama Sachivalayam exam Result

Post a Comment

0 Comments