CBSE Merit Scholarship Scheme for Single Girl Child
ఈ స్కాలర్‌షిప్స్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 18 చివరి తేదీ.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE స్కాలర్‌షిప్ కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. 'సీబీఎస్ఈ మెరిట్ స్కాలర్‌షిప్ ఫర్ సింగిల్ గాళ్ చైల్డ్ ఫర్ ప్లస్ 2 స్టడీస్-2019' పేరుతో ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది సీబీఎస్ఈ. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఆర్థికంగా చేయూతను అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్స్‌కు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్‌కు అప్లై చేయొచ్చు. దరఖాస్తుకు అక్టోబర్ 18 చివరి తేదీ. స్కాలర్‌షిప్స్ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి సీబీఎస్ఈ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
2019లో సీబీఎస్ఈ 10వ తరగతి 60 శాతం మార్కులతో పాసై, 11వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నవాళ్లు దరఖాస్తు చేయాలి.
CBSE Scholarship: అర్హతలు ఇవే...
2019లో సీబీఎస్ఈ 10వ తరగతి 60 శాతం మార్కులతో పాసై, 11వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నవాళ్లు దరఖాస్తు చేయాలి.
విద్యాసంవత్సరంలో మంత్లీ ఫీజు రూ.1,500 లోపు ఉన్నవాళ్లే స్కాలర్‌షిప్‌కు అప్లై చేయాలి.
సింగిల్ గాళ్ చైల్డ్ అంటే తల్లిదండ్రులకు ఒక కూతురై ఉండాలి. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు ఉండకూడదు.
రెన్యువల్ చేసేవాళ్లు వేరుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
సింగిల్ గాళ్ చైల్డ్ అంటే తల్లిదండ్రులకు ఒక కూతురై ఉండాలి. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు ఉండకూడదు.
రెన్యువల్ చేసేవాళ్లు వేరుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
Tags: CBSE, EDUCATION, Scholarship, single girl child, 10th class, 2019లో సీబీఎస్ఈ, సింగిల్ గాళ్ చైల్డ్, ఆన్‌లైన్ దరఖాస్తు
0 Comments